Micah 4

1చివరిరోజుల్లో యెహోవాా మందిర పర్వతం

పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది.
కొండల కంటే ఎత్తుగా ఉంటుంది.
ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.

2అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు,

<< యాకోబు దేవుని మందిరానికి,
యెహోవాా పర్వతానికి మనం వెళ్దాం, పదండి.
అయన తన విధానాల్ని మనకు నేర్పిస్తాడు.
మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.>>
సీయోనులో నుంచి ధర్మశాస్త్రం,
యెరూషలేములో నుంచి యెహోవాా వాక్కు వెలువడతాయి.
3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాల్ని పరిష్కరిస్తాడు.
వారు తమ కత్తుల్ని నాగటి నక్కులుగా
తమ ఈటెల్ని మచ్చు కత్తులుగా సాగగొడతారు.
రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు.
యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.

4దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా

తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు.
ఇది సేనల అధిపతి యెహోవాా నోట వెలువడ్డ మాట.
5ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు.
మనమైతే మన యెహోవాా దేవుని పేరును బట్టి
ఎప్పటికీ నడుచుకుంటాము.

6యెహోవాా ఇలా చెబుతున్నాడు,

ఆ రోజు నేను కుంటి వారిని పోగుచేస్తాను.
అణగారిన వారిని, నేను కష్టపెట్టినవారిని దగ్గరకు చేరుస్తాను.
7కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని
బలమైన ప్రజగా చేస్తాను.
యెహోవాానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి
ఎప్పటికీ వారిని పాలిస్తాను.
8మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు
పూర్వపు అధికారం వస్తుంది.
యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.

9మీరెందుకు కేకలు వేస్తున్నారు?

మీకు రాజు లేడా?
మీ సలహాదారులు నాశనమయ్యారా?
అందుకే ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా మీరు బాధపడుతున్నారా?
10సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా
నొప్పులు పడుతూ కను.
ఎందుకంటే మీరు పొలంలో బతికేలా పట్టణం వదిలిపెట్టండి.
బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది.
అక్కడే యెహోవాా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు.

11అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి,

<<సీయోను అపవిత్రం అవుతుంది గాక!
దాని నాశనం మేము కళ్ళారా చూడాలి.>> అంటారు.
12ప్రవక్త ఇలా అంటాడు, యెహోవాా తలంపులు వారికి తెలియవు.
ఆయన ఆలోచన అర్ధం కాదు.
కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.

యెహోవాా ఇలా అంటున్నాడు,

<<సీయోను కుమారీ, లేచి కళ్ళం తొక్కు.
మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ చేస్తాను.
నీవు అనేక ప్రజల సమూహాల్ని అణిచేస్తావు.
వారి అన్యాయ సంపదను యెహోవాానైన నాకు ప్రతిష్టిస్తాను.
వారి ఆస్తిపాస్తుల్ని సర్వలోక ప్రభువునైన నాకు ప్రతిష్టిస్తాను.>>
13

Copyright information for TelULB